నర్సీపట్నం: మూడేళ్లకోసారి నిర్వహించే పట్టణ ప్రజల ఇలవేల్పు మరిడమ్మ జాతర కనులపండువగా జరిగింది. రెల్లివీధి నుండి అమ్మను గరగలు నృత్యం, వివిధ కాగితపు పువ్వుల అలంకరణతో తీసుకువచ్చారు. ఊరేగింపులో వివిధ రకాల కళాకారులు, వేషదారుణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, అమ్మవారి శక్తి అవతారాలతో కళాకారులు, వివిధ రకాల డప్పు వాద్యకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా ప్రజలు ఊరేగింపును తిలకించడానికి బారులు తీరారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు.


