మునిగి యువకుడికోసం గాలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్) సురక్షితం ఒడ్డుకు చేర్చిన యువకుడుతో మైరెన్ పోలీసులు
ఎస్.రాయవరం: రేవుపోలవరం వద్ద సముద్రంలోకి దిగి మునిగిపోతున్న ఓ యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.ఈ మేరకు పెంటకోట మైరెన్ సీఐ వై. మురళీ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతి జిల్లా తిరుపతి మండలం కోర్లగుంట గ్రామానికి చెందిన సీహెచ్ తేజ ఐదుగురు స్నేహితులతో కలిసి నర్సీపట్నంలో ఉంటున్న స్నేహితుడు మహేష్ ఇంటికి వచ్చాడు.వీరంతా కలిసి శుక్రవారం రేవుపోలవరం తీరానికి వెళ్లారు.స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు.ఈ సమయంలో పెద్దఅల రావడంతో తేజ మునిగిపోయాడు.తోటి స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మైరెన్ సీఐ మురళి, ఎస్‌ఐ వి.వి.ఎం. దొర,కానిస్టేబుల్ చిన్నబాబు,హెచ్‌జీఎస్ పి.అప్పలరాజు,వి.గోపి రక్షించి తేజాను ఒడ్డుకు చేర్చారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.తేజస్నేహితులు , కుటుంబ సభ్యులు మైరెన్ పోలీసులుకు కృతజ్ఞతలు తెలిపారు.


