గేట్‌ ఫలితాల్లో మత్స్యకార విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గేట్‌ ఫలితాల్లో మత్స్యకార విద్యార్థిని ప్రతిభ

Mar 21 2026 5:06 AM | Updated on Mar 21 2026 5:06 AM

● ఆలిండియా స్థాయిలో 1940వ ర్యాంకు కై వసం

● ఆలిండియా స్థాయిలో 1940వ ర్యాంకు కై వసం

ర్యాంకు సాధించిన పవిత్రను అభినందిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఎస్‌.రాయవరం: చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకార కుటుంబానికి చెందిన చోడిపల్లి పవిత్ర గేట్‌ ఆలిండియా 1940 ర్యాంకు సాధించింది. ఎస్‌.రాయవరం మండలం వాకపాడు పంచాయతీ బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు కోటయ్య, సోమేరు దంపతులు కుమార్తె పవిత్ర ప్రభుత్వ హాస్టల్‌ ఉంటూ పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం గాయత్రీ కళాశాలలో ఇంజనీరింగ్‌ ఫైనలీయర్‌ చదువుతున్న సదరు విద్యార్థిని ఈ ర్యాంకు సాధించింది. సర్పంచ్‌ మైలపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు నాయకులు కోదండరావు, నారాయణ, పోతురాజు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెతోపాటు తల్లిదండ్రులను దుశ్శాలువాతో సత్కరించారు. పేదరికంలో పెద్ద చదువులు వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement