అనకాపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రం అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వేర్వేరుగా మహిళాదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజుఅధ్యక్షతన, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్నాల పద్మకుమారి ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బీవీ.సత్యవతి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనే మహిళా సాధికారత లక్ష్యంగా పాలన సాగిందన్నారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ పద్ధతి ద్వారా రూ.2లక్షల 70వేల కోట్లను మహిళలు బ్యాంక్ ఖాతాలో జమచేశారని చెప్పారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వంపై మహిళలకు విరక్తి కలిగిందని, జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పా రు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవు తున్నా ప్రతి మహిళలకు నెలకు రూ.1500 చెల్లించే పథకాన్ని నేటికీ అమలు చేయలేదన్నారు. మహిళలను మోసం చేయడం సీఎం చంద్రబాబునాయుడుకు వెన్నతోపెట్టి విద్యఅని చెప్పారు. తగిన సమయంలో ప్రభుత్వానికి మహిళలే బుద్ధి చెబుతారని తెలిపారు. మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్నాల పద్మకుమారి మాట్లాడుతూ మహిళలు అందరూ ఉన్నతస్థానాలను అలంకరిస్తున్నారని చెప్పా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, కశింకోట వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, కశింకోట మహిళా విభాగం అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం, జిల్లా మహిళా నాయకురాళ్లు నీటిపల్లి లక్ష్మి, నీలకంఠ లక్ష్మి, ఆశాజ్యోతి, ఆమిటి ధనలక్ష్మి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, 80,81 వార్డు ఇన్‌ఛార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కశింకోట ఎంపీపీ కలగలక్ష్మి గున్నయ్యనాయుడు, పార్టీ కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, మాజీ కౌన్సిలర్ దాడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
తుమ్మపాల: మహిళలు పారిశ్రామికవేత్తలుగా అంతర్జాతీయ స్థాయిని చేరాలని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ సీఎం రమేష్ అకాంక్షిచారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమేష్ మాట్లాడారు. జేసీ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీఆర్‌డీఏ పీడీ శచి దేవి, డీఎల్‌వీవో మంజులవాణి, మహిళా సంఘాల సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


