మహిళా బాక్సర్లను అభినందిస్తున్న అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్, మహిళా బాక్సర్ యర్రా తేజస్వని
నర్సీపట్నం: పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో నింజాస్ అకాడమీ నుంచి ముగ్గురు మహిళా బాక్సర్లు పాల్గొంటున్నారు. సీనియర్ నేషనల్ బాక్సర్స్ బొంతు మౌనిక 75 కిలోలు, యర్రా తేజస్విని 81 కిలోలు, ఎ.లక్ష్మీ తేజస్విని 81 కిలోలు విభాగాల్లో పాల్గోనున్నట్టు శాప్ కోచ్ కె.అబ్బు తెలిపారు. పోటీలకు బయలుదేరి వెళ్తున్న మహిళా బాక్సర్లకు నింజాస్ అకాడమీ డైరెక్టర్ సుతాపల్లి శ్రీకాంత్ శనివారం అభినందనలు తెలిపారు.


