విముక్తి లేదయా? | - | Sakshi
Sakshi News home page

విముక్తి లేదయా?

Mar 7 2026 7:34 AM | Updated on Mar 7 2026 7:34 AM

గ్యాప్‌ ఏరియా..
గిరిజన ప్రాంతంలో కొండల మీద ఉన్న గ్యాప్‌ ఏరియా భూములను సర్వే చేసేందుకు 17 ఏళ్లుగా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లడమే తప్ప సర్వే నేటికీ కార్యరూపం దాల్బలేదు. కలెక్టర్లు వస్తున్నారు..గ్యాప్‌ ఏరియా భూములు సర్వే చేస్తారు.. మాకు హక్కు పత్రాలు ఇస్తారని ఏళ్ల తరబడి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాంతంలో లేటరైట్‌ నిక్షేపాలు ఉండడం గిరిజనుల పాలిట శాపంగా మారింది.

నాతవరం/సాక్షి,అనకాపల్లి : జిల్లా వ్యాప్తంగా గ్యాప్‌ ఏరియా సమస్యలతో సతమతమవుతున్నా గిరిజను లకు కష్టాల నుంచి విముక్తి కలగడం లేదు. నాతవరం మండలంలో సరుగుడు, సుందరకోట పంచాయతీల పరిధిలో కొండల మీద ఉన్న వేలాది ఎకరాలు భూములు బ్రిటి్‌ష్‌ హయాంలోనే సర్వే చేయకుండా వృథాగా వదిలేశారు. గ్యాప్‌ ఏరియా భూములను సర్వే చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తామంటూ 2008 నుంచి కలెక్టర్లుగా పనిచేసిన వారంతా ఈ ప్రాంతం క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నారు. మొదటిసారి అప్పటి జిల్లా జాయింట్‌ కలెక్టరు గిరీష్‌శంకర్‌ ఉమ్మడి సరుగుడు పంచాయతీలో పలు ప్రాంతాలను పరిశీలించారు, ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు , సబ్‌ కలెక్టర్లులుగా పని చేసిన అనేక మంది అధికారులు సరుగుడు, సుందరకోట పంచాయతీలో ఉన్న గ్యాప్‌ ఏరియా భూములను చూసేందుకు స్వయంగా పర్యటించారు. అయినా నేటి వరకు సర్వే పూర్తి కాలేదు. సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, మాసంపల్లి , దద్దుగుల, సుందరకోట పంచాయతీ శివారు కొత్తసిరిపురం అసనగిరి, సుందరకోట, కొత్త దద్దుగుల,ముంతమామిడిలొద్దు బమ్మిడికలొద్దు, తోరడ, కొంత లంకలు, సిరిపురం గ్రామాలు ఉన్నాయి, ఆ రెండు పంచాయతీల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాలు పైగా గ్యాప్‌ ఏరియా భూములు ఉన్నాయి. అ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు తుప్పలు డొంకలు కొట్టి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఏళ్లతరబడి వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి చొరవతో 800మందికి పైగా గిరిజనులకు హక్కుపత్రాలు అందజేశారు. మరో 550 మంది గిరిజనులకు హక్కు పత్రాలు సిద్దం చేసి సార్వత్రిక ఎన్నికల కారణంగా నిలిపేశారు. ఇటీవల కలెక్టరు విజయకృష్ణన్‌ కొత్త దద్దుగుల ప్రాంతంలో గ్యాప్‌ ఏరియా భూములను స్వయంగా పరిశీలించి నెల రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆర్డీవో రమణ, సర్వేయర్లకు ఆదేశించారు. గ్యాప్‌ ఏరియా భూములు సర్వే చేసి రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తేనే గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి కుదురుతుంది. ఈ విషయంపై మండల సర్వేయరు సత్యనారాయణను సంప్రదించగా గ్యాప్‌ ఏరియా భూములు సర్వే చేయాలంటే అధునిక టెక్నాలజీ కల్గి యంత్రాలతో చేస్తే తప్ప మాములు మిషనరీతో చేయడం కష్టం అన్నారు.

12 ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నాం...

గిరిజనులు సాగు చేసుకుంటున్న సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. అప్పట్లో జేసీ నివాస్‌ సరుగుడు వచ్చి గ్రామసభ పెట్టారు. గత కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి కృషితో కొంత మంది గిరిజనులకు హక్కుపత్రాలు ఇచ్చారు. దీనికి అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ విశేషంగా కృషి చేశారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కొంత మందికి పట్టాలు సిద్ధం చేసినా ఇవ్వలేకపోయాం.

– సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ, నాతవరం

జిల్లా వ్యాప్తంగా నాతవరం, గొలుగొండ, మాడుగుల, రోలుగుంట, రావికమతం మండలాల్లో 50 వరకూ క్లిష్టమైన గిరిజన గ్రామాలున్నాయి. దాదాపుగా 18 వేల ఎకరాలకు పైగా గ్యాప్‌ ఏరియా ఉంది. మాడుగుల మండలంలో నాగుల కొండ, ఉరలోవ కొండ, కొప్పు కొండ, సామలమ్మకొండ గిరిజన గ్రామాల్లో 2 వేలకు పైగా ఎకరాల గ్యాప్‌ ఏరియా ఉంది. రావికమతం, రోలుగుంట మండలంలో 1500 ఎకరాలకు పైగా గ్యాంప్‌ ఏరియా ఉంది. రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో వారికి ఐటీడీఏ సదుపాయాలు అందడం లేదు. ప్రభుత్వం నుంచి అన్ని ఫలాలు ఆగిపోతున్నాయి.

కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ముగ్గురు కలెక్టర్లు కళ్లారా చూసినా తీరని కష్టాలు స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 43 క్లిష్టమైన గిరిజన గ్రామాలు దాదాపుగా 18 వేల ఎకరాలకు పైగా గ్యాప్‌ ఏరియా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో అందని ఐటీడీఏ సదుపాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement