రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌

Feb 3 2026 7:29 AM | Updated on Feb 3 2026 7:29 AM

రూ. 4

రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌

రేపు ప్రవేశపెట్టనున్న మేయర్‌
బడ్జెట్‌ ప్రొఫైల్‌

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మేయర్‌ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్‌ హాల్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి నాలుగేళ్లు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌ హోదాలో బడ్జెట్‌ను ఆమోదింపజేయగా, ప్రస్తుత పాలకవర్గంలో మేయర్‌ పీలా శ్రీనివాసరావుకు ఇది చివరి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశంగా నిలిచింది. బుధవారం నిర్వహించనున్న ఈ బడ్జెట్‌ సమావేశానికి సంబంధించి గత నెల 12నే జీవీఎంసీ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్‌, స్థాయీ సంఘం చైర్మన్‌ సమక్షంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో వివిధ విభాగాల వారీగా కేటాయింపులు, జమలు, ఖర్చులపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, కొన్ని మార్పులు చేర్పులతో ముసాయిదాకు ఆమోదం తెలిపారు.

బడ్జెట్‌ అంచనాలు ఇలా..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంచనాలను పరిశీలిస్తే, ప్రారంభపు నిల్వ రూ.365.96 కోట్లుగా ఉండగా, అన్ని పద్దుల కింద వచ్చే జమలు రూ.3814.41 కోట్లుగా లెక్కించారు. వెరసి మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు కాగా, వివిధ అభివృద్ధి పనులు మరియు నిర్వహణ కోసం రూ.4047.12 కోట్లను ఖర్చుగా ప్రతిపాదించారు. చివరగా రూ.133.25 కోట్లను ముగింపు నిల్వగా నిర్ణయించారు. శాఖల వారీగా చూస్తే సాధారణ పరిపాలన విభాగంలో రూ.1232.60 కోట్ల జమలు, రూ.375.82 కోట్ల ఖర్చులు ఉండగా, అత్యధికంగా ఇంజనీరింగ్‌ విభాగంలో రూ.1018.18 కోట్ల ఖర్చులను ప్రతిపాదించారు. లైటింగ్‌ విభాగం కోసం రూ.129.19 కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ.67.35 కోట్లు, టౌన్‌ ప్లానింగ్‌ కోసం రూ.23.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు కేటాయించగా, విద్య, పార్కుల అభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయానికి వస్తే అమృత్‌ పథకం కింద రూ.388 కోట్లు, ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.215 కోట్లు, అర్బన్‌ చాలెంజింగ్‌ ఫండ్‌ ద్వారా రూ.650 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ.340.82 కోట్ల వ్యయాన్ని బడ్జెట్‌ అంచనాల్లో పొందుపరిచారు.

రూ.1018.18 కోట్లు

ఇంజినీరింగ్‌ విభాగం

అర్బన్‌ చాలెంజింగ్‌ ఫండ్‌

రూ.650 కోట్లు

ప్రజారోగ్యం విభాగానికి

రూ.455.94 కోట్లు

నీటి సరఫరా విభాగానికి

రూ.260.08 కోట్లు

రూ.129.19 కోట్లు

లైటింగ్‌ విభాగం కోసం

టౌన్‌ ప్లానింగ్‌ కోసం

రూ.23.98 కోట్లు

ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు

ముగింపు నిల్వ రూ.133.25 కోట్లు

అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4047.12 కోట్లు

రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌ 1
1/1

రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement