చెరకు బకాయిలు చెల్లించాలని ఆందోళన
రావికమతం: చెరకు బకాయిలు తక్షణమే చెల్లించాలని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఏడాది కిత్రం గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలించామని, ఇంతవరకూ బకాయిలు చెల్లించలేదని మండలంలో మేడివాడ, గర్నికం గ్రామాల రైతులు వాపోయారు. అప్పులు చేసి చెరకు పండించామని, ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు బకాయిలు చెల్లించలేదని రైతులు శానాపతి శ్రీను, జంపా శేషు, గొర్లి సత్యారావు, అప్పలనాయుడు తదితరులు వాపోయారు. అనంతరం న్యాయం చేయాలని తహసీల్దార్ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు.


