యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ పనులు పూర్తి చేయాలి
అనకాపల్లి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనకాపల్లి పర్యటన ఉందని, పర్యటనను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం అనకాపల్లి జోన్ పరిధిలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్, వై జంక్షన్, ఎన్టీఆర్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లాలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే అవకాశాలు ఉన్నందున జీవీఎంసీ తరపున చేపడుతున్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.వై జంక్షన్ వద్ద హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. డ్రైనేజీలో పూడికలు, భవన నిర్మాణ వ్యర్థాలు రహదారులపై లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎన్టీఆర్ ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, డీఎస్పీ ఎం.శ్రావణి, ఆర్డీవో షేక్‌అయిషా, సీఐలు ప్రేమ్ కుమార్, వెంకటనారాయణ, ఆశోక్‌కుమార్, డీసీ హెచ్‌ఎస్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి పాల్గొన్నారు.
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంకు ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ వద్ద ఉన్న సంపద కేంద్రాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పర్యటన అధికారికంగా ఖరారు కావలసి ఉంది.
కమిషనర్ కేతన్‌గార్గ్


