మర్యాదపూర్వక కలయిక
మునగపాక/అనకాపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సూచించారు.
మర్యాదపూర్వక కలయిక


