కేసులు పెట్టినా ఆగే ప్రసక్తే లేదు
చంద్రబాబునాయుడు దగ్గరకు తీసుకెళ్తాం అంటేనే దీక్ష విరమణకు ఒప్పుకున్నాం. నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏమీ మాట్లాడ లేదు. పోరాటం ఆపేస్తాం అనుకుంటున్నారేమో, కేసులు పెట్టినా, అరెస్టుచేసిన ఆగే సమస్యలేదు. ఇక్కడ బల్క్‌డ్రగ్‌పార్క్‌కట్టడానికి కుదరదంతే. చంద్రబాబుకు ఇదే విషయం చెప్తాం. మాప్రాణాలు తీసే కంపెనీలు మాకొ ద్దు. భూములు తీసుకునేటప్పుడు ఇలాంటి కంపెనీలు పెడతామని చెప్పలేదు. నక్కపల్లిలో మీటింగ్‌లో కూడా ఇదే చెప్పేం. పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు కాబట్టే ఆందోళన చేస్తున్నాం. ఈ నెలాఖరు లోగా చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లాలి. లేకపోతే మా ఊరోళ్లమంతా మీటింగ్‌పెట్టుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం.
–రాజేశ్వరి,మహిళ, రాజయ్యపేట


