నెలరోజులైనా...
కమిటీ ఏర్పడి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మత్స్యకారులకు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించలేదు. కమిటీ ఏర్పాటు, సీఎంతో చర్చలపేరుతో ఉద్యమాన్ని నీరుగార్చారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం వద్ద తీసుకెళ్తానన్న హోంమంత్రి ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదని కొంత మంది మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగానే కమిటీలు, చర్చలంటూ మభ్యపెట్టారని ఆరోపిస్తున్నారు. డిసెంబరు నెలాఖరులోగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమ బాటపడతామని, తాడోపేడో తేల్చుకుంటామని గంగపుత్రులు చెబుతున్నారు.


