పీఎం సూర్యఘర్‌తో తగ్గనున్న విద్యుత్ భారం
రావికమతం: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గిస్తుందని ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ జి.ప్రసాద్ తెలిపారు. రావికమతం,టి.అర్జాపురం, కొత్తకోటల్లో బుధ వారం సీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ పథకం వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పా రు. జిల్లాలో ఇప్పటి వరకు 3,500 మందికి ఈ పథకం అమలు చేసినట్టు తెలిపారు. రావికమ తం మండలానికి సంబంధించి ఇప్పటి వరకు 60 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్‌డీఎస్‌ఎస్ పథకంతో వ్యవసాయరంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులునిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీఈ సురేష్‌కుమార్, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


