మాడుగులలో సైకో వీరంగం
మాడుగుల: మాడుగుల పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బుధవారం సాయంత్రం ముగ్గురిపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సైకోను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు ఎస్‌ఐ నారాయణరావు అందించిన వివరాలు... స్థానిక రాజవీధికి చెందిన నారాయణమ్మ.. సున్నం పనికి వెళ్తుండగా వెనక నుంచి దాడి చేయడంతో కుడిచేయి విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కొండబాబు అనే వ్యక్తిని కర్రతో తలపై కోట్టడంతో తీవ్రంగా గాయపడి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అడ్డుకోడానికి వెళ్లిన గ్రామానికి చెందిన కోడా వెంకటేశ్వరులుపై సైకో దాడిచేయడంతో కాలుపై గాయమైంది. ఈ వ్యక్తిని విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
మాడుగులలో సైకో వీరంగం


