అనాథ శవాలకు ఆత్మబంధువు
అనకాపల్లి పట్టణం గవరపాలేనికి చెందిన తరుణ్ బీటెక్ పూర్తి చేశారు. ఆయన బీటెక్ చదువుతున్న సమయంలో కరోనా మహమ్మారి ఎంతో మందిని కబళించింది. అయిన వాళ్లు సైతం దగ్గరకు వెళ్లని రోజులవి. చాలామంది ఆస్పత్రుల సమీపంలో ఉన్న శ్మశానవాటికల్లో ప్యాకేజీలు మాట్లాడుకుని అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోయారు. ఆ హృదయ విదారక ఘటనలు చూసిన తరుణ్ మనస్సుకు బాధ కలిగింది. ఆ ఆలోచనల నుంచి దేవా సోషల్ సర్వీస్ అనే సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. కరోనా సమయంలోనే దాదాపు 200 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఒకానొక సమయంలో తాను స్వయంగా కరోనా బారినపడినప్పటికీ ఇంట్లో ఉండి వైద్యుల సూచనలతో మందులు తీసుకుని బయటపడ్డారు. కుటుంబ సభ్యులు వారించినా కరోనా తగ్గిన మరుక్షణం మళ్లీ మృతదేహాల అంత్యకియలకు బయలుదేరారు. అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు
ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు తరుణ్ తన సేవలను కొనసాగిస్తున్నాయి. ఇలా కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు 1500 వరకు మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. పోలీసులు, పంచాయతీరాజ్‌శాఖ, మున్సిపాల్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న తక్షణమే తరుణ్.. మృతదేహం వద్దకు వెళ్లి అక్కడి నుంచి శ్మశానవాటికకు తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో మృతదేహాలు కుళ్లిపోయి, పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా వాటికి దహన సంస్కారాలు నిర్వహించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.
విశాఖ గాజువాకలో బైక్‌పై అనాథ మృతదేహాన్ని తీసుకుని వెళుతున్న తరుణ్
అలరించిన వేదసభ
మహారాణిపేట: మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ఆదివారం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయ ఆవరణలో వేదసభ, అర్చక సదస్సు నిర్వహించారు. పలువురు వేదపండితులు నాలుగు వేదాలపై చేసిన పఠనం ఆద్యంతం అలరించింది. అనంతరం ఈవో శోభారాణి వేదపండితులు, అర్చకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి దేవస్థానం వేదపండితులు ముష్టి భీమ శంకర శాస్త్రి, ముష్టి వెంకటేశ్వర ఘనాపాఠి, కోట పంచముఖి శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి శ్రీనివాస శర్మ, ముఖ్య అర్చకులు బి.ఎన్.ఎస్. భట్టర్, ఈవో కె. శోభారాణి, ఏఈవో ఎన్. ఆనంద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకట రమణ, సిబ్బంది పాల్గొన్నారు.
దృఢ సంకల్పంతో
సేవ చేస్తున్నా..
బీటెక్ చదువుతున్న సమయంలో ప్రపంచం కరోనాతో విలవిలాడుతోంది. మహమ్మారితో మృత్యవాత పడితే పట్టించుకోలేని పరిస్థితులను చూశాను. ఆ ఆలోచనల్లో పుట్టింది దేవా సోషల్ సర్వీస్ సంస్థ. బతికున్నంత కాలం సేవా చేయాలనే దృఢ సంకల్పంతో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాను. ఆ తరువాత అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్నాను. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగా మ్‌లో నా వీడియోలు చూసి డాక్టర్లు, మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి మేము సైతం అంటూ సహాయ, సహకారాలు అందించారు.
– తరుణ్
చదివింది బీటెక్. ఈ సమాజం కోసం నాకెందుకులే అనుకుంటే ఐదంకెల జీతంతో హాయిగా గడిపేయొచ్చు. కానీ తరుణ్ అలా అనుకోలేదు. కరోనా మహమ్మారి సమయంలో కుటుంబ సభ్యులు సైతం ముట్టని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి అందరి మన్ననలు పొందాడు. అలా అప్పటి నుంచి అనాథ శవాలకు ఆత్మబంధువుగా మారాడు. దేవా సోషల్ సర్వీస్ సంస్థ స్థాపించి ఇచ్ఛాపురం నుంచి రాజమండ్రి వరకు తన సేవలు కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. – అనకాపల్లి
దేవా సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు తరుణ్ విశేష సేవలు
కరోనాతో మృతి చెందినవారి దీనావస్థ చూసి చలించిన యువకుడు
శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు
ఇప్పటి వరకు 1500 వరకు
దహన సంస్కారాలు


