ఆకట్టుకున్న ‘సిరి గంధం’ నాటిక
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్, నాటికలోని సన్నివేశం
మునగపాక: మునగపాక నందీశ్వర కళాప్రాంగణం, తులసీ కళావేదికపై ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ‘సిరి గంధం’ నాటిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దివంగత రంగస్థల దర్శకుడు మొతికా సాంబశివరావు మాస్టారు 10వ సంస్మరణలో భాగంగా ఈ నాటిక ప్రదర్శించారు. మునగపాకకు చెందిన మిత్ర కళా యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నాటికకు శ్రీ స్నిగ్ద రచన అందించగా దాడి ముసిలినాయుడు దర్శకత్వం వహించారు. నాటికలోని నటీ నటులు అద్బుతంగా నటించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సాంబశివరావు మాస్టారు చిత్రపటం వద్ద వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ నివాళులర్పించి మాట్లాడారు. ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత సాంబశివరావుకే దక్కుతుందన్నారు. వారి ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దిమ్మల అప్పారావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, జెడ్‌పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, పెద్దలు టెక్కలి పరశురామ్, మొల్లేటి సత్యనారాయణ, కాండ్రేగుల జగ్గారావు, డాక్టర్ బద్దెం సూర్యనారాయణ, బొడ్డేడ రాజు, టెక్కల సూరప్పారావుతో పాటు సాంబశివరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘సిరి గంధం’ నాటిక


