‘శంబాల’ ఏ ఒక్కర్నీ నిరాశ పరచదు
హీరో ఆది సాయికుమార్
డాబాగార్డెన్స్: సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ యూనిట్ ఆదివారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 25న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్ ఆదివారం నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని చోట్లా పాజిటివ్ స్పందన వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. హిందీ రిలీజ్ గురించి అందరూ అడుగుతున్నారని, యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారన్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదలవుతుందని, విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. హీరోయిన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ శంబాల తనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని, ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు.


