బల్క్‌డ్రగ్ పార్క్ రద్దు చేయాలి
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్‌ను వెంటనే రద్దుచేయాలని ఏపీ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో నిరాహారదీక్ష చేస్తున్న మత్స్యకారులకు గురువారం రైతుకూలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతుకూలీ సంఘం జిల్లాకార్యదర్శి కోన మోహన్‌రావు, నవయువ సమాఖ్య జిల్లాకన్వీనర్ ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ 1,276 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 53 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఆందోళనలో స్థానిక మత్స్యకారులు సోమేష్, స్వామి, మహేష్, బాబ్జి, అప్పలరాజు పాల్గొన్నారు.


