మా పొలం నష్టం నమోదు నిలిపేశారు..
తుమ్మపాల, శంకరం గ్రామాల పొలాలు కలిసే ఉంటాయి. శంకరం గ్రామంలో ఉన్న మా పొలంతో పాటు సమీపంలో ఉన్న తుమ్మపాలకు చెందిన 1.5 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న వరి పంట తుపానులో పూర్తిగా మునిగిపోయింది. పక్కనే ఉన్న శంకరం పొలానికి నష్టం నా పేరుతో నమోదు చేశారు. కానీ తుమ్మపాల పొలంలో జరిగిన నష్టాన్ని మాత్రం నమోదు చేయకుండా మూడు రోజులు తిప్పించుకున్నారు. చివరకు పొలాలకు నష్టం లేదంటూ నమోదు నిలిపేశారు.
– గుమ్మాల సత్తిబాబు,
రైతు, శంకరం గ్రామం


