శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
పంట నష్ట పరిహారంలో కూటమి ప్రభుత్వం కోత పెడుతోంది. పంట నష్ట పరిహారం కోసం చేసే ఎన్యూమరేషన్ ప్రక్రియ సందర్భంగా క్షేత్ర స్థాయిలో అధికారులపై నష్టం లెక్క తగ్గించాలంటూ ఒత్తిడి తెస్తోంది. జిల్లా తుఫాన్ ప్రభావంతో 15,180 ఎకరాల్లో పంటనష్టం జరిగితే దానిలో భారీగా కోత విధించి 3,452 ఎకరాల్లో పంట నష్టం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ జీవోలో ఇచ్చిన విధంగా 33 శాతం పంట నష్టం తీవ్రతను పరిగణించాలని ప్రకటించినా..క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్‌ను తగ్గిస్తున్నారు. 50 శాతం పంట నష్టం ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.


