సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు
మురళీనగర్(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫ్యాషన్ డిజైన్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి కోర్సులో శిక్షణ తీసుకున్న 2024–25 బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్, స్టూడెంట్స్ అఫైర్స్ కోఆర్డినేటర్ ఎస్.వి.రమణ గురువారం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు.


