48 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: అచ్చర్ల జంక్షన్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. దీనిని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం దుచ్చిర్తి గ్రామానికి చెందిన అక్కపల్లి సుధాకర్ (36)ను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రవాణాకు వినియోగించిన కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎస్‌ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తమ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిని అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


