వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
కె.కోటపాడు: జీనబాడు జీటీడబ్ల్యూఏ బాలికల వసతిగృహం పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా వసతిగృహ సిబ్బందికి సూచనలు చేయాలని పినకోట పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి అల్లూరి జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. జీనబాడు వసతిగృహనికి చెందిన ముగ్గురు విద్యార్థినులు కృష్ణవేణి, ప్రమీల, శ్రీవేణి దేవి జ్వరాలతో బుధవారం రాత్రి దేవరాపల్లి పీహెచ్‌సీ వైద్యం కోరకు వచ్చారు. వీరికి ప్రథమ చికిత్సను అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. ఆసుపత్రిలో గురువారం ముగ్గురు విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించగా సాధారణ జ్వరాలు నివేదిక వచ్చినట్లు మలేరియా అధికారి తులసికి మలేరియా సబ్ యూనిట్ అధికారి బాబూరావు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఎన్‌వీబీడీసీపీ జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాస్, ఏఎంవో ఎ.జె.సత్యనారాయణ, వైద్యాధికారి వెంకటేష్ పాల్గొన్నారు.


