చిత్ర దర్శకుడు అనిల్‌ | - | Sakshi
Sakshi News home page

చిత్ర దర్శకుడు అనిల్‌

Nov 7 2025 7:02 AM | Updated on Nov 7 2025 7:02 AM

చిత్ర దర్శకుడు అనిల్‌

చిత్ర దర్శకుడు అనిల్‌

గ్రామీణ నేపథ్యంలో ‘రోలుగుంట సూరి’

సబ్బవరం: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రోలుగుంట సూరి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చిత్ర దర్శకుడు అనిల్‌ పళ్ల తెలిపారు. సబ్బవరంలోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న 100 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతందని, ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో హీరోగా నాగార్జున పళ్ల, హీరోయిన్లుగా ఆద్యారెడ్డి, భావన నటించినట్లు తెలిపారు. విలన్‌ పాత్రలో బ్రహ్మానంద రెడ్డి చక్కని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తాను హీరోగా పరిచయమవుతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్ర దర్శకుడిది సబ్బవరం మండలం చినగొల్లలపాలెం. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన పళ్ల తాతారావు, మల్లునాయుడులేనికి చెందిన ఆరిపాక ప్రసాద్‌, కె.సంతోష్‌ కుమార్‌, పళ్ల సత్యనారాయణ, రోమాల చంద్రశేఖర్‌ తదితరులకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement