ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు
నాతవరం: దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలోరోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాజాన వీర సూర్య చంద్ర సహకరించారు. చెర్లోపాలెం పంచాయతీ శివారు పార్వతీపురం గ్రామానికి కొంతమంది బుధవారం కాకినాడ జిల్లా సత్యనారాయణస్వామి అన్నవరం దేవస్థానంలో జరిగే గిరి ప్రదక్షిణకు ఆటోపై బయలు దేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సంఘటన స్ధలంలో కారు అపి గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరిటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. బాధితులంతా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.


