రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎం
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలంలో పాతవలసలో అండర్–14 విభాగంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి జి.జశ్వంత్, 9వ తరగతి విద్యార్థి సీహెచ్. అశోక్ విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను కై వసం చేసుకుని, రాష్ట్ర వాలీబాల్ జట్టులో స్థానం సంపాదించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 27న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ఇద్దరూ పాల్గొంటారని స్థానిక గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్‌పాల్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులతో పాటు వీరికి తర్ఫీదు ఇచ్చిన పీఈటీ తరుణ్, పీడీ ఉమామహేష్‌లను ప్రిన్సిపాల్ విక్టర్‌పాల్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇరటా నర్సింహమూర్తి, ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి (డీసీవో) గ్రేస్ అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి పాఠశాల విద్యార్థిని ద్రాక్షవరపు రాణి రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ రవికుమార్ తెలిపారు. 4వ తేదీన ఎస్‌జీఎఫ్ అండర్ 14 వాలీబాల్ స్కూల్ గేమ్స్ కె.కోటపాడు మండలం పాతవలస పాఠశాల్లో జరిగిన ఎంపిక పోటీల్లో 8 వ తరగతి చదువుతున్న రాణి ఎంపికై నట్టు చెప్పారు. రాణిని హెచ్‌ఎం జి.రామారావు అభినందించారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎం


