ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు
కె.కోటపాడు: ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో భాగంగా పాతవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను స్థానిక సర్పంచ్ జామి శ్రావణ్, ఎంపీటీసీ వర్రి రామునాయుడు ప్రారంభించారు. అండర్–14 బాల బాలికల విభాగంలో అనకాపల్లి, నర్సీపట్నం, అల్లూరి, విశాఖపట్నం, భీమిలి డివిజన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన బాలుర, బాలికల జట్ల నుంచి 24 మందిని ఎంపిక చేయనున్నట్లు హెచ్‌ఎం నాగేశ్వరరావు తెలిపారు. విద్యా కమిటీ చైర్‌పర్సన్ జామి ఉమాదేవి, పీడీలు బి.కృష్ణ, కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు దార్లపూడి విద్యార్థులు
ఎస్.రాయవరం: జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దార్లపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు హెచ్‌ఎం జాన్‌మెతెషెలా మంగళవారం తెలిపారు. బాలికల ట్రిపుల్ జంప్‌లో పి.నాగమౌనిక, జె.తారకలక్ష్మి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వారిని వ్యాయామ ఉపాధ్యాయురాలు నిర్మల, తదితరులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గాంధీనగరం విద్యార్థులు
అనకాపల్లి: స్థానిక గాంధీనగరం జీవీఎంసీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఎన్.హర్షవర్దన్, టి.లోవరాజు కబడ్డీలో రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు స్థానిక స్కూల్ ఆవరణలో వారిని మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం టి.సంధ్య కుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి హెచ్.నేతాజీ, ఉపాధ్యాయుడు కె.అప్పారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు


