టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి
తుమ్మపాల: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూకలెక్టరేట్‌లో మంగళవారం డీఆర్వో సుబ్బలక్ష్మికి ఫ్యాప్టో జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు చిన్నారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి బోధనలో ఉన్న ఉపాధ్యాయులు టెట్ రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన మార్పులు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ఎస్.దుర్గాప్రసాద్, ఆచంట రవి, కార్యవర్గ సభ్యులు కె.పరదేశి, సిహెచ్.నాగేశ్వరరావు, ధర్మారావు, అక్కు నాయుడు, మామిడి బాబూరావు, మధు, సింహాచలం నాయుడు పాల్గొన్నారు.


