
బల్క్ డ్రగ్ పార్క్ వ్యర్థాల విడుదలకు టెండర్లపై ఫిర్య
బైక్ మీద తాటిచెట్టు పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
నక్కపల్లి: ఒక వైపు బల్క్ డ్రగ్ పార్క్ రద్దు కోసం పోరాటం చేస్తుంటే.. మరోవైపు అధికారులు వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు టెండర్లు పిలవడం సమంజసం కాదంటూ పలువురు మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ, సీఆర్‌జడ్ అనుమతులు లేకుండా మైరెన్ అవుట్‌ఫాల్‌కు ఎలా టెండర్లు పిలుస్తారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మత్స్యకారుడు సోమేష్, తదితరులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఏపీఐఐసీ అధికారులు మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి రోజుకు విడుదలయ్యే 52.72 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు రూ.16.81 కోట్లకు టెండర్లు పిలవడం, ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాతత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారని, జాతీయ రహదారి ముట్టడిస్తే రాజయ్యపేట వచ్చి చర్చలు జరరుపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కలెక్టర్ చర్చలు ఇంకా పూర్తి కాలేదని, ఈ లోగా ఏపీఐఐసీ అధికారులు టెండర్లు పిలవడం తగదన్నారు. ఒక పక్క మత్స్యకారులతో చర్చలు జరుపుతూనే మరో పక్క ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు.

బల్క్ డ్రగ్ పార్క్ వ్యర్థాల విడుదలకు టెండర్లపై ఫిర్య