పాఠ్య పుస్తకాల సమీక్షలో నాగజ్యోతికి అవకాశం | - | Sakshi
Sakshi News home page

పాఠ్య పుస్తకాల సమీక్షలో నాగజ్యోతికి అవకాశం

Oct 19 2025 6:39 AM | Updated on Oct 19 2025 6:53 AM

తన ప్రజెంటేషన్‌ను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎం.కృష్ణారెడ్డికి సమర్పించిన

రోలుగుంట టీచర్‌ నాగజ్యోతి, తదితరులు

రోలుగుంట: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ)ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాల పునఃసమీక్ష కార్యక్రమం విజయవాడలోని ఎస్‌జే కన్వెన్సన్‌ సెంటర్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాపులో రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన సబ్జెక్టు నిపుణులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల టీచర్‌ పీవీఎం నాగజ్యోతి కూడా పాల్గొని తన ప్రజెంటేషన్‌ను సమర్పించారు. ఈ వర్క్‌షాపు ద్వారా పాఠ్య పుస్తకాల పునః సమీక్ష, రూపకల్పనలో తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement