
మాజీ మంత్రి కురసాలను కలిసిన బొడ్డేడ
మునగపాక: వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును ఆదివారం కాకినాడలో పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించడంలో సహకరించిన కన్నబాబు ఆశీర్వాదం తీసుకుని సత్కరించారు. పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, కాండ్రేగుల జగన్, పిన్నమరాజు రవీంద్రరాజు, ఈత బాబూరావు, బొడ్డేడ బుజ్జి, రామకృష్ణ, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు, వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.