ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

Sep 29 2025 7:26 AM | Updated on Sep 29 2025 7:26 AM

ఇద్దర

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

మరొకరికి తీవ్ర గాయాలు

కాలినడకన విజయవాడ వెళుతుండగా వెనుక నుంచి ఢీకొట్టిన కారు

నల్లజర్ల/నక్కపల్లి: కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ మాలధారులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో వీరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కుర్తి శివ, పక్కుర్తి శ్రీను, పక్కుర్తి శేశీలు, కోనా గోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామమైన దోశలపాడు గ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని పాదయాత్రగా విజయవాడ బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్‌ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతి చెందిన శివకు భార్య దేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

పంటబోదెలో శ్రీను మృతదేహం

పక్కుర్తి శివ, పక్కుర్తి శ్రీను (ఫైల్‌)

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం 1
1/3

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం 2
2/3

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం 3
3/3

ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement