
మాజీ డిప్యూటీ సీఎం బూడిని కలిసిన బొడ్డేడ
తారువలో పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను సత్కరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడును ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన సందర్భంగా తారువలో ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ముత్యాలనాయుడు, బొడ్డేడ ప్రసాద్ పరస్పరం ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ బొడ్డేడకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితర పలువురు నాయకులు పాల్గొన్నారు.