
కొనసాగుతున్న నిరాహారదీక్ష
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్ష శుక్రవారం 12రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆరాధ్యదైవం నూక తాత ఆలయం వద్ద ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి దీక్ష కొనసాగించారు. బల్క్ డ్రగ్‌పార్క్ పనులు అడ్డుకునేందుకు రోడ్డుపై మత్స్యకారులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ అయిన వెంటనే వచ్చి గ్రామస్తులతో మాట్లాడతానని హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో సందేశం పంపించడంతో ధర్నా విరమించి, నూకతాత ఆలయం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దీక్షకు వైఎస్సార్‌సీసీ నాయకులు వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం జిల్లాకార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజులు మద్దతు తెలిపి, మత్స్యకారులతోపాటు దీక్షలోకూర్చొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేసే వరకుపోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సూరాకాసుల గోవిందు, గంటాతిరుపతిరావు, గొర్ల గోవిందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు,ఎరిపిల్లి నాగేశు, మహిషే, సూరిబాబు,కాశీరావు,సోమేష్, రాజశేఖర్, నూకరాజు,యజ్జల అప్పలరాజు,పైడితల్లి తదితరులు పాల్గొన్నారు.