
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్ : విధ్యుత్ శాఖ్ గురై మునగపాక మండలం, అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన అప్పికొండ కృష్ణ (25)మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అప్పికొండ కృష్ణ వృత్తి రీత్యా రాడ్ బెండింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మండలంలో మడుతూరు పంచాయతీ ఎరికిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటికి రాడ్ బెండింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్ కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.