
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా బొడ్డ
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా పనిచేస్తున్న బొడ్డేడ ప్రసాద్ ఆ పదవిలో కూడా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన వైఎస్సార్ హయాంలో ఆర్‌ఈసీఎస్ చైర్మన్‌గా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు.