
మాజీ సైనికుల కోసం పెన్షన్ పోర్టల్ ప్రారంభం
అనకాపల్లి: కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో మాజీ సైనికులకు పెన్షన్ పోర్టల్ స్పర్శ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అగ్గాల హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జిల్లాలో మాజీ సైనికులు సుమారు 7,100 మంది ఉన్నారని, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా సోల్జర్స్ బోర్డు ఉండేదని, కొత్త జిల్లాలో తాత్కాలికంగా స్పర్శ్ సెంటర్‌ని ఏర్పాటు చేశారని చెప్పారు. మాజీ సైనికుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనే ఒక పెన్షన్ వ్యవస్థని 2021లో తీసుకొచ్చిందని, ఈ డిజిటల్ ప్లాట్‌ఫారం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని నెహ్రూచౌక్ వద్ద ఏర్పాటు చేశామని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9573043507ను సంప్రదించాలని ఆయన కోరారు.