
పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ సిబ్బందికి వేతనాల పెం
అనకాపల్లి: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు చెందిన నక్కపల్లి, చోడవరం పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సీనియారిటీ ప్రాతిపదికన గౌరవ వేతనాలు పెంచినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో పెట్రోల్ బంకుల సిబ్బందితో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాల పెంపుతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ రిజర్వ్ సీఐ బి.రామకృష్ణ, నక్కపల్లి బంక్ ఇన్‌చార్జ్, ఏఆర్ ఎస్‌ఐ వర్మ, నక్కపల్లి, చోడవరం పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ సిబ్బంది పాల్గొన్నారు.