
వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
ఎస్.రాయవరం: మండలంలో జాతీయ రహదారిపై గెడ్డపాలెం జంక్షన్ సమీపంలో మంగళవారం ఓ వ్యాన్ వెనక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి నాగేశ్వరరావు(48) బైకుపై వెళ్తుండగా విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెనక నుంచి ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన ఆయనను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందారు. నాగేశ్వరరావును ఢీకొట్టిన వ్యాన్ రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి