
చిరు వ్యాపారుల ప్రతిఘటన
జీవీఎంసీ జేసీబీకీ అడ్డంగా కూర్చొని నిరసన
అనకాపల్లి: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన చిరు వ్యాపారుల బడ్డీలను జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఐదు రోజులుగా తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం రహదారిలో బడ్డీలను తొలగిస్తుండగా, అక్కడ చిరు వ్యాపారులు ప్రతిఘటించారు. జేసీబీకి అడ్డంగా కూర్చోని వాటిని తొలగించవద్దని నినాదాలు చేశారు. సుమారుగా 30 సంవత్సరాలుపైగా ఇక్కడే జీవిస్తున్నామని, ఉన్నపళంగా బడ్డీలను తొలగించడం అన్యాయమని వాపోయారు. మరో ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేందుకు స్థలం చూపించాలని నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులకు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన లక్ష్మణ్, తదితరులు మద్దతు పలికారు.