
భారీ గణపతికి ఘనంగా వీడ్కోలు
అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంపంత్ వినాయక కమిటీ ఏర్పాటు చేసిన 126 అడుగుల వినాయక విగ్రహం అనుపు కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు సోమవారం ప్రత్యేక పూజలందుకున్నారు. భారీ విగ్రహం కావడంతో నిలిపినచోటే నిమజ్జనం చేశారు.
ఫైర్ ఇంజిన్‌తో సుమారు గంటపాటు నీళ్లను పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గణేశుని నిమజ్జనాన్ని జనం పెద్దసంఖ్యలో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుద్ద భూలోక నాయుడు, బుద్ద భాను ప్రకాష్, సినీ డైరెక్టర్ ఆడారి సాయి మూర్తి, మళ్ళ రాము, మద్దాల భాను తదితరులు పాల్గొన్నారు.