
గొడుగులతో క్వారీ బాధితుల నిరసన
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాఽధితులు మండుటెండలో గొడు గులు వేసుకుని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. బీఎస్పీ నాయకుడు బి.నాగరాజు, సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు 60 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోగా, దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించటం అన్యాయమన్నా రు. అధికారులు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. అధికారులకు దళితుల ఆవేదన కానరాలేదన్నారు. అధికారుల తప్పిదం ఉండటం వల్ల దొంగచాటుగా టెంట్ తొలగించారని మండిపడ్డారు. అధికారులు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా ఉద్యమం ఆగదన్నారు.