సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలు... | - | Sakshi
Sakshi News home page

సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలు...

Sep 23 2025 7:55 AM | Updated on Sep 23 2025 7:55 AM

సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలు...

సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలు...

డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామంటూ భయపెట్టారు..

● బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, యూపీఐ పిన్‌, ఓటీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది.

● డిజిటల్‌ లావాదేవీలకు బార్‌కోడ్‌లు, క్యూఆర్‌ కోడ్‌లు స్కానింగ్‌ లేదా ఎంపిన్‌ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.

● ఏదైనా ఫోన్‌కాల్‌, ఈ–మెయిల్‌ చేసి మీ కేవైసీ అప్డేట్‌ చేయాలని వివరాలు అడిగినా చెప్పరా దు. ఒకవేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవాలి. హోం బ్యాంక్‌ శాఖను సంప్రదించాలి.

● ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లలో యూఆర్‌ఎల్‌, డొమైన్‌ పేర్లను స్పెల్లింగ్‌ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కోసం అధికార వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి.

● ఏదైనా వెబ్‌సైట్‌, అప్లికేషన్‌లో మీ ఈమెయిల్‌ను యూజర్‌ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్‌ పాస్‌వర్డ్‌ను ‘పాస్‌వర్డ్‌’ అని పెట్టుకోవద్దు.

సాక్షి, అనకాపల్లి:

లా ఒకరిద్దరు కాదు చాలామంది సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు నష్టపోతున్నారు. పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ ఆన్‌లైన్‌లో ఫేక్‌ లింక్‌లు పెట్టి వాటిని క్లిక్‌ చేసేలా ఆశ చూపించి మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. ఫేక్‌ యాప్‌లు, ఫేక్‌ లింక్‌ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ర్సీపట్నానికి చెందిన ఒక వృద్ధుడు సైబర్‌ మోసానికి గురయ్యారు. ముంబై పోలీసులమంటూ ఫోన్‌ చేసి.. మీ బ్యాంక్‌ ఖాతాలో అనాథరైజ్డ్‌గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయిందని, తక్షణమే రిటర్న్‌ కొట్టకపోతే అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే బ్యాంక్‌ ఖాతా వివరాలన్నీ చెప్పండి చెక్‌ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వారి మాటలకు భయపడి బ్యాంక్‌ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకు తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైబర్‌ నేరగాళ్ల బ్యాంక్‌ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి, బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement