
శరన్నవరాత్రులు ప్రారంభం
నూకాంబిక అమ్మవారి ఆలయంలో
కలశ పూజ చేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొలువులో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్సవాలను ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, రక్షా సూత్రధారణ, అఖండ దీపస్థాపనం, నవదుర్గా పీఠ స్థాపన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్ట, హోమాలు, పతాక ప్రతిష్ట, నీరాజన మంత్ర పుష్పాలు, కలశ స్థాపన వంటి అనేక కార్యక్రమంలు నిర్వహించారు. మొదటి రోజు మధ్యాహ్నం అమ్మవారి ఆలయం వద్ద దాడి ఆదిశివ నూకరాజు, కాండ్రేగుల యోగవినోద్ కుమార్ ఆర్థిక సహాయంతో వెయ్యి మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు.