
లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు
తుమ్మపాల: గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు వంటి పరీక్షలకు వినియోగించే యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.హైమావతి హెచ్చరించారు. మాతా శిశు మరణాలు, పీసీపీఎన్‌డీటీ జిల్లా కమిటీ సమావేశం సోమవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అధికారులకు స్కానింగ్ సెంటర్లను విధిగా తనిఖీలు చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు జరిగిన మాతా శిశు మరణాలు, ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై సమీక్షించామన్నారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, కమిటీ సభ్యులు, ప్రైవేట్ వైద్యులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో హైమావతి