
చోరీ కేసుల్లో అయిదుగురి అరెస్టు
మునగపాక: మండలంలోని రెండు చోరీలకు పాల్పడిన అయిదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలో మూడు రోజుల క్రితం నాగులాపల్లిలో చల్లా వెంకయ్యకు చెందిన ట్రాక్టర్ రిమ్ములు, బెల్ హౌసింగ్‌తోపాటు చిన్న యోక్, ఆటోను నలుగురు వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీంతో వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునగపాకలో వ్యవసాయ పొలాల వద్ద క్రషర్ల పనిముట్లు, పాత కత్తులు, గునపాలు, రాడ్స్, నిప్పల్ స్టిక్స్, 295 కిలోల ఇనుము చోరీకి గురయ్యాయంటూ రైతు పెంటకోట రామ నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయా కేసుల విచారణలో భాగంగా అయిదుగురిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు.