
విద్యార్థులను కొట్టిన స్కూల్ కరస్పాండెంట్‌పై కేసు
అనకాపల్లి: స్థానిక గాంధీనగరం సాయి శక్తి ప్రైవేట్ హైస్కూల్‌ల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు బొబ్బిలి పవన్‌కృష్ణ, ఆకాశపు షణ్ముఖసాయి రాజ్‌లను హైస్కూల్ కరస్పాండెంట్ అన్నం రాజశేఖర్ శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను ఇనుప స్కేల్‌తో వీపుపై తట్టు వచ్చే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తట్టులను చూపించగా కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి అడుగుతున్న సమయంలో కరస్పాండెంట్ అక్కడ నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు చేరుకుని స్కూల్‌కు సోకాజ్ నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను కొట్టడం చట్టనిత్య నేరమని, ప్రభుత్వ పరంగా స్కూల్‌పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సాయిశక్తి హైస్కూల్‌పై, కరస్పాండెంట్ అన్నంరాజశేఖర్‌పై కేసు పెట్టారు.