
వజ్ర కవచధర గోవిందా..
కశింకోటలో వజ్ర కవచాలంకృతునిగా
ధ్యాన వేంకటేశ్వరస్వామి
కశింకోట: స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామిని శనివారం వజ్ర కవచాలంకృతుని చేసి, పూల మాలలు, తులసీ మాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు సహస్ర నామార్చన చేశారు. నక్షత్ర హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అలాగే గవరపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా అర్చకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.