
ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 13 అర్జీలు
ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న
కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్‌న్స్‌లో ఆమె ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకి పలువులు ఉద్యోగులు హాజరై వారి సమస్యలపై అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించడానికి అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. మొత్తం 13 మంది ఉద్యోగులు వారి సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి సుబ్బలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి విజయ్ కుమార్, పీజీఆర్‌ఎస్ సెల్ సూపరింటెండెంట్ సురేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.