
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
వివిధ స్టేషన్లో 8 కేసులు నమోదు
గొలుగొండ: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎస్‌ఐ రామారావు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెలలో ఏజెన్సీ నుంచి కారు, బైక్‌లో 216 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా, ఏటిగైరంపేట వద్ద బుచ్చెయ్యపేటకు చెందిన చొప్పా నాగరాజు(38) అప్పట్లో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ చాకచక్యంగా పట్టుకొని కోర్టుకు తరలించారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లో 8 కేసులు నమోదు కాగా, బుచ్చెయ్యపేట స్టేషన్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నిందితుడిని పట్టుకున్న గొలుగొండ ఎస్‌ఐ రామారావు, సిబ్బందిని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ అభినందించారు.